చిరు 153…ఎవరితో…?

175
chiru 153 movie

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మెగాస్టార్‌.

ఈ సినిమాలో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తారనే వార్తలు వెలువడుతుండగా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది ఈ చిత్రం. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తుండగా ఈ మూవీ తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు చిరు.

కొరటాల సినిమా తరువాత త్రివిక్రమ్ …డివివి దానయ్య కాంబినేషన్లో సినిమా ఉండబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అయితే తాజాగా బోయపాటి పేరు తెరమీదకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి కోసం బోయపాటి కథను రెడీ చేసుకున్నారని, అల్లు అరవింద్ కూడా కథ నచ్చడంతో కొరటాల శివ సినిమా తరువాత ఇది సెట్స్ మీదకు వెళ్లబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు 153 త్రివిక్రమ్ తో చేస్తారా..లేదంటే బోయపాటితో చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.