ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ఃసుప్రీకోర్టు

363
supreme Court
- Advertisement -

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం కిందకి వస్తుందా లేదా అనే అంశంపై నేడు కోర్టులో చర్చ జరిగింది. ఈ అంశంపై నేడు తీర్పు వెల్లడించింది సుప్రీం. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ తీర్పును వెలువరించింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్‌లు ఎన్.వీ.రమణ, డీ.వై. చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.

సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. పారదర్శకతలేని వ్యవస్థను ఎవరూ కోరుకోరు. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థ నాశనమవ్వకూడదు అని విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు.

- Advertisement -