తీహార్ జైలుకు చిదంబరం

238
Chidambaram Tihar Jail

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో చిదంబరాన్నిఇవాళ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పర్చగా చిదంబరానికి స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ సెప్టెంబర్ 19వరకు 14 రోజుల వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ మేరకు అధికారులు చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. చిదంబరం తన వెంట మందులు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైలులో చిదంబరం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అంతకుముందు ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఆదేశాల ప్రకారం చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 19 వరకూ ఆ జైల్లోనే చిదంబరం  ఉండనున్నారు.