కరోనా వైరస్ కు చికెన్ కు ఎలాంటి సంబంధం లేదు

250
Ktr Chicken

కరోనా వైరస్ కు చికెన్ , గుడ్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో చికెన్‌, ఎగ్‌ మేళా నిర్వహించారు. చికెన్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో అవగాహన కల్పనే లక్ష్యంగా నెక్‌, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో చికెన్‌, ఎగ్‌ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సినీనటి రష్మిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చికెన్‌తో పాటు గుడ్లు తిన్నారు. చికెన్‌, ఎగ్‌ మేళాకు నగరవాసులు భారీ ఎత్తున తరలివచ్చారు.

chicken

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… చికెన్ తినడం వల్ల కరోనా వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మద్దన్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీపై మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు పండించే రైతులు ఆధారపడి ఉన్నారు. వారిని డీలా పరిచేలా తప్పుడు ప్రచారాలు తగదు. దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీని త్వరలోనే తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తమ కుటుంబ సభ్యులం అందరం రోజు చికెన్ తింటామని చెప్పారు.