మరొకొన్ని గంటల్లో చందమామ చెంతకు చంద్రయాన్2

299
Chandrayaan 2
- Advertisement -

చంద్రయాన్ 2 మరికొన్ని గంటల్లో చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుంది. శుక్రవారం రాత్రి దాటాక… 1.40 నుంచీ 1.55 మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15 నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. మనకు దీనిపై పెద్దగా టెన్షన్ ఉండదు కానీ ఇస్రో శాస్ర్తవేత్తలకు మాత్రం కంటి మీద కునుకు ఉండదనే చెప్పుకోవాలి.

క్షణక్షణం ఉత్కంఠే. ఈ క్షణాల కోసమే వాళ్లు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. 48 రోజుల కిందట… చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్షంలోకి వెళ్లిన ఆర్బిటర్ ప్రయాణం… క్రమంగా భూమికి దూరమవుతూ… చందమామకు దగ్గరవుతూ సాగింది.

నాలుగు రోజుల కిందటే… చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచీ… విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. అది చందమామ చుట్టూ తిరుగుతూ… క్రమంగా చందమామకు అత్యంత దగ్గరగా చేరువైంది. ప్రస్తుతం అది చందమామకి 35 కిలోమీటర్లు దగ్గరగా… 101 కిలోమీటర్లు దూరంగా ఉంది. రాత్రి 1.40కి అది చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది.

- Advertisement -