చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-2

537
chandrayaan 2
- Advertisement -

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగంలో కీలక ఘటం ఆవిష్కృతమైంది. ఇవాళ ఉదయం9.02 గంటలకు చంద్రయాన్ -2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది. . ఓరియెంటేషన్‌ ప్రక్రియతో పాటు చంద్రయాన్‌-2 వేగాన్ని తగ్గించి దాని దశ దిశ మార్చడంతో ఉపగ్రహం చంద్రుడి 114కి.మీ x 18072 కి.మీ కక్ష్యలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను మండించడం ద్వారా చేపట్టారు.

ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న చంద్రయాన్‌-2పై మరో నాలుగు విన్యాసాలు చేపట్టనున్నారు. ఆగస్టు 21, 28, 30న చేపట్టే ఈ ప్రయోగాల ద్వారా చంద్రయాన్-2 జాబిల్లికి చేరువగా ఉండే చివరి కక్ష్యలోకి చేరుకుంటుంది.

ఆ తర్వాత సెప్టెంబరు రెండో తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 7వ తేదీ ఉదయం 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో సాఫీగా ల్యాండింగ్‌ చేయనుంది. ఆర్బిటర్‌, ల్యాండర్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు ల్యాండింగ్‌ ప్రాంతాన్ని రియల్‌ టైమ్‌లో చిత్రాలను తీసి పంపనున్నాయి.

- Advertisement -