చంద్రయాన్2.. చివరి క్షణంలో మిస్సింగ్..

321
vikramdown
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 2 చివరి క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో తెలిపింది. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రధాని మోడీ అభినందించారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, దేశమంతా శాస్త్రవేత్తల వెంట ఉంటుందన్నారు.చివరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.

అయితే, ‘విక్రమ్’ మరో నిమిషంలో జాబిల్లిని ముద్దాడుతుందనగా సిగ్నల్స్ పూర్తిగా ఆగిపోయాయి.అర్ధరాత్రి 1:38 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపైకి దూసుకొస్తున్న విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తొలుత విజయవంతంగా తగ్గించగలిగారు. దీంతో ప్రయోగం సక్సెస్ అవుతుందనే శాస్త్రవేత్తలు ధీమాగా కనిపించారు. ఒంటి గంట 53 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుందని ఇస్రో అధికారులు ప్రకటించారు.

ఇదే విషయాన్ని ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రధానికి ఇస్రో ఛైర్మన్ వివరించారు.చంద్రయాన్ 2 విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాన్ని ప్రధాని అభినందించారు. ఇకపై మరింత ధైర్యంగా అంతరిక్ష ప్రయోగాలు చేయాలని దేశం యావత్తు శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని వీక్షించారు.

- Advertisement -