జాబిల్లికి కూతవేటు దూరంలో…

513
chandrayaan 2
- Advertisement -

జాబిల్లికి మరింత చేరువైంది విక్రమ్ ల్యాండర్‌. చంద్రుడిపై అడుగుపెట్టే లక్ష్యంతో చంద్రయాన్‌ 2 ప్రతి అంచెనూ దాటుకుంటూ ముందుకెళ్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌.. చంద్రుడి చుట్టూ తన కక్ష్యను విజయవంతంగా తగ్గించుకుంది.

ఇవాళ ఉదయం ప్రొపెల్షన్ సిస్టంను 9 సెకన్లు మండించిన ఇస్రో…చంద్రుడి దక్షిణ ధ్రువానికి ‘విక్రమ్’ ల్యాండర్‌ని చేర్చారు. ఫలితంగా ఈనెల 6న అర్ధరాత్రి దాటాక చంద్రుడిపై కాలుమోపనుంది ల్యాండర్.

ప్రస్తుతం ల్యాండర్ 35 కిలోమీటర్లు X 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. ఆర్బిటర్ 96 కిలోమీటర్లుX125 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఒక నవ వధువు తన పుట్టించి నుంచి మెట్టినింటికి పయనమవ్వడం లాంటిదని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.

- Advertisement -