ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ..

223
chandrababu
- Advertisement -

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐకి ఏపీలోకి అనుమతి లేదని…ఒకవేళ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై పౌరులు,కేసులు,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై తనిఖీలు చెయ్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. రైల్వే వ్యవహారాల్లో మినహా.. ఇతర చోట్ల ఎలాంటి సోదాలు చెయ్యాలన్నా షరతులు వర్తిస్తాయి.

సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా..1947 ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ప్రకారం ఏర్పాటైంది.  కాబట్టి సీబీఐ పరిధి ఢిల్లీ వరకు మాత్రమే. తర్వాత రాష్ట్రాల వ్యవహారాల్లో సీబీఐ తలదూర్చడంపై వివాదాలు రేగాయి. చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం.. ప్రభుత్వ అనుమతితో మాత్రమే సీబీఐ సంబంధిత రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టాలి.

ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాని అవినీతి, అక్రమాలకు పాల్పడితే సీబీఐ నేరుగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టవచ్చు. ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైనా సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇటీవల రాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయేందుకు సీబీఐని కేంద్రం ఆయుధంగా వాడుకుంటోంది. అంతేగాదు సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్.. సీబీఐ ఏపీలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి అని తెలిపింది.

- Advertisement -