ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ `చాణ‌క్య‌`

705
gopi chand
- Advertisement -

వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా `చాణ‌క్య` యూనిట్ ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు,సాంకేతిక వర్గం: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు,ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి,కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర,మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్,సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి,రైటర్: అబ్బూరి రవి,ఆర్ట్: రమణ వంక,కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్,పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

- Advertisement -