నీ తల్లిని అలా అంటే సూపర్ అంటావా..!

233
Actor ,Chalapathi Rao,comments,women,Rarandoi Veduka Chudham,pre-release,celebrities,Naga Chaitanya, Rakul Preet, Nagarjuna,Telugu film,Anchor Ravi,
- Advertisement -

సీనియర్ నటుడు చలపతిరావు చేసిన అసభ్యకర వ్యాఖ్యాలతో మహిళాలోకం భగ్గుమంది. చలపతిరావుపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సంఘం నేతలు యాంకర్ రవిపై కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా టాలీవుడ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలను కించపరచడానికే ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ మహిళా సంఘాల నేత సజయ ఆరోపించారు.‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ మెడకు చుట్టుకొనేలా ఉంది. చలపతిరావు వ్యాఖ్యలకు సంబంధించి నిర్మత నాగార్జున,హీరో నాగ చైతన్య,హీరోయిన రకుల్ ప్రీత్‌ సింగ్‌ కూడా తప్పుబట్టారు.

Chalapathi Rao comments on women

సీనియర్ నటుడనే సంస్కారం లేకుండా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన చలపతిరావు మహిళలకే కాకుండా మానవజాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. చలపతిరావు చేసిన కామెంట్‌కు ‘సూపర్ సర్’ అన్న యాంకర్ రవి తమకు కనిపిస్తే కాళ్లు విడగ్గొడతామని హెచ్చరించారు. రవి యాంకరింగ్ చేసే అన్ని షోలలోకూడా ఆడవాళ్ల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ సజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు యాంకర్‌గా ఉండాలంటే ఉండు. నీకు ఉన్న టాలెంట్ చూపించు. కానీ ఈ రకమైన కామెంట్లు చేయకు.

Chalapathi Rao comments on women

చలపతిరావు చేసిన వ్యాఖ్యలు సూపర్‌ అటు సమర్ధించవు.. నీ తల్లిని అట్లా మాట్లాడితే నువ్వు సూపర్ అంటావా అని మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఎవడు వాడు అసలు? వాడి వయసెంత.. వాడు సూపర్ అని మాట్లాడడానికి. వాడు క్షమాపణ చెప్పాలి.. నాగార్జున కూడా చెప్పాలి. వాళ్ల కుటుంబం తరపున, ఇండస్ట్రీ తరపున బయటకొచ్చి మేం క్షమాపణ చెబుతున్నాం అని నాగార్జున క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ తీసెయ్యాలి.’’ అని ప్రముఖ ఉద్యమకారిణి సజయ డిమాండ్ చేశారు.

- Advertisement -