కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులు..

395
corona
- Advertisement -

రాష్ట్రాలకు విపత్తు ప్రమాద నిర్వహణ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. 11వేల 92 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడానికి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. 2020-21 ఏడాదికి గాను SDRMF కు మొదటి విడత కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. కోవిడ్‌-19 నేపథ్యంలో రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా ఉండటం కోసమే విడుదల చేసినట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

క్వారెంటైన్ వసతులు, నమూనా సేకరణ, పరీక్ష అదనపు పరీక్ష కేంద్రాలకు వైద్య మున్సిపల్, పోలీసు, అగ్నిమాకమపక సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్యూమెంట్, వెంటిలేటర్స్, థర్మల్ స్కానర్స్ సమాకూర్చేందేకు ఈ నిధుల విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్టానికి 224.5 కోట్లు నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి 491.14 కోట్లు విడుదల చేసింది. 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు 14రాష్టాల ఆర్థిక లోటు భర్తీకి 6, 195 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.

- Advertisement -