రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయలేదు

332
harish Rao
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంత్రి. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకొని, ప్రజా సంక్షేమ పథకాలపై సలహాలు ,సూచనలు ఇవ్వాలని ఆయన చెప్పారు.

మిషన్‌కాకతీయ పథకంలో పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చినమన్నారు. మిషన్‌కాకతీయపై నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ డాక్యుమెంటరీ రూపొందించిందని చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నమని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఒక లక్షా 17వేల714పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందని త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

- Advertisement -