6 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

121
ram-nath-kovind

దేశంలో పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందర్ ను ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న ఆనంది బెన్ పటేల్ ను ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బదిలీ చేశారు.

పశ్చిమబెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధన్ఖర్, త్రిపుర గవర్నర్ గా రమేశ్ బయాస్, నాగాలాండ్ గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమిస్తున్నట్లు తెలిపింది.అలాగే బిహార్ గవర్నర్ గా పగూ చౌహాన్, మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీ టాండన్ ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.