చివరికి న్యాయం జరిగింది- అల్లు అర్జున్

287
allu arjun

ఈ ఉదయం దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ,క్రీడా ప్రముఖులు ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘనటపై ‘న్యాయం జరిగింది’ అంటూ సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘చివరికి న్యాయం జరిగింది… తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు.. RIP దిశ’ అని సినీనటుడు విశాల్ ట్వీట్ చేశారు.

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో న్యాయం జరిగిందని కథా రచయిత కోన వెంకట్ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ అని భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీ, క్రీడా ప్రముఖులు కోరుతున్నారు. హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.