టీమిండియాకు ప్రముఖుల ప్రశంసలు

270
- Advertisement -

భారత్-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. తొలి వన్డేలోనే టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు కనబరిచారు. కెప్డెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్డెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి.. విండీస్ ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా టీం.. అద్బుతమైన ఆటను ప్రదర్శిస్తూ 8 వికేట్ల తేడాతో విండీస్ పై గెలిచింది.

తొలి వన్డేలోనే ఘన విజయాన్ని సాధించిన భారత ఆటగాళ్లకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆటలో ఏ మాత్రం తగ్గకుండా మెరుగైన ఆట తీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఆరోసారి 150 పరుగులు చేసినందుకు రోహిత్‌కు వీరేంద్ర సేహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీ, రోహిత్ మ్యాచ్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుంటే చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉందని.. డబుల్ ధమాకా అంటూ ట్వీట్ చేశాడు.

ఇద్దరూ కలిసి అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారని.. వీరిద్దరి దూకుడును ఎవరూ ఆపలేరని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. వన్డేల్లో కోహ్లీ, రోహిత్ శతకాలు చేశారని.. ఈ రెండు శతకాలు గొప్పవని.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇరగదీశారని స్పష్టం చేశాడు.

గొప్ప విజయాన్ని సాధించినందుకు టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీ ప్రదర్శన అత్యద్బుతమని.. రోహిత్ శర్మ మైదానాన్ని ఆక్రమించేశాడని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

ఈ తరానికి విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెంట్ ఉన్నందుకు భారత క్రికెట్ ఎంతో అదృష్టం చేసుకుందని.. 70ల కాలం నుంచి భారత క్రికెట్ గర్వించదగ్గ బ్యాట్స్‌మెన్స్ వస్తూనే ఉన్నారని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

- Advertisement -