కావేరీ కోసం సమంత సాయం..

167
samantha

సమంత అక్కినేని అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు.. సామాజిక భాద్యత కూడా. ఈమె సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో సమాజం కోసం కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంత సామాజిక కార్యక్రమాలతోనూ పేరు తెచ్చుకున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా, కావేరీ నది పరిరక్షణ కోసం ముందుకొచ్చారు. ఇటీవలే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కావేరీ నది పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని సంకల్పించగా, సమంత కూడా తన వంతుగా సద్గురుకు మద్దతు ప్రకటించారు.

Samantha

ఈ నేపథ్యంలో, తన వెబ్ సైట్ లో విరాళాలు అందించాలంటూ ప్రకటన ఇచ్చారు. కావేరీ పిలుస్తోంది, లక్ష మొక్కలు నాటుదాం, రండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. కేవలం రూ.42 విరాళంగా అందిస్తే ఒక మొక్కను నాటినవారవుతారని సమంత వివరించారు.

సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. తమిళ సినిమాలో విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించారు.