విజయ్ దేవరకొండకు జంటగా కేథరిన్..!

251
Vijay Deverakonda
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది.. గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జే కే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Vijay Deverakonda

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, కేథరీన్ తెరిస్సా తదితరులు.. సాంకేతిక నిపుణులు: రచయిత & దర్శకుడు: క్రాంతి మాధవ్, సమర్పణ: కేఎస్ రామా రావు, నిర్మాత: కె.ఎ. వల్లభ, బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్, సంగీతం: గోపి సుందర్, డిఓపి: జే కే, ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్, PRO: వంశీ-శేఖర్.

- Advertisement -