నన్నపనేనిపై కేసు పెట్టిన మహిళా ఎస్‌ఐ..!

264
Nannapaneni Rajakumari

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 303, 506,509 ఆర్‌/డబ్ల్యు 34 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక అసలు విషయానికొస్తే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే అనితలు చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేయడం చేశారు.

nannapaneni

ఈ నేపథ్యంలో ‘దళితుల వల్లనే ఈ దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని అలా మాట్లాడడం సరికాదని ఎస్సై మండిపడ్డారు. అక్కడి నుండి వెళ్లిపోయిన ఎస్ఐ తనపై నన్నపనేని చేసిన ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నన్నపనేనిపై కేసు నమోదైంది.