కేటీఆర్‌తో కంటోన్మెంట్ నేతల భేటీ..!

353
ktr

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కంటోన్మెంట్ నియోజకవర్గ నేతలు భేటీ కానున్నారు. టీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యులు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. కంటోన్మెంట్ సమస్యలపై బోర్డు సభ్యులు చర్చించే అవకాశం ఉంది.

కంటోన్మెంట్ బోర్డుకు రిజిస్ట్రేషన్‌శాఖ చెల్లించాల్సిన ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్(టీపీటీ) రెండేండ్లుగా చెల్లించడంలేదు. టీపీటీతోపాటు ఆర్‌టీఏ, ఆర్‌టీసీ, విద్యుత్, పోలీసు, న్యాయ శాఖల నుంచి బోర్డుకు చెల్లించాల్సిన సర్వీసు చార్జీలతోపాటు జీఎస్‌టీ, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డు వాటాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు సభ్యులు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని, బొల్లారం దవాఖానలో మెరుగైన వైద్య సేవలు కల్పించాలని, రామన్నకుంట ప్రక్షాళన, నీటి సరఫరా బిల్లుల తగ్గింపుపై చర్చించే అవకాశం ఉంది.