కుండబద్దలుకొట్టిన జైట్లీ..

230
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుండబద్దలుకొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ఆ అవకాశం కూడా లేదని తేల్చిచెప్పారు. హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగానే.. హోదాతో వచ్చే నిధుల కంటే ఎక్కువగానే ఏపీకి ప్యాకేజీ రూపంలో నిధులు అందిస్తున్నట్లు వెల్లడించారు జైట్లీ. అంతేకాకుండా ఏపీకి 90:10 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

రెవెన్యూలోటును కూడా భర్తీ చేస్తున్నట్లు చెప్పిన మంత్రి.. ఆ మేరకు ఇప్పటికే రూ.1600 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 10 నెలల ఆధారంగానే రెవెన్యూలోటు భర్తీ జరుగుతుందని.. అయితే ఏపీకి 12 నెలల కింద లెక్కించి లోటు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.4వేల కోట్ల రెవెన్యూలోటు భర్తీ జరిగిందని.. ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.138 కోట్లు మాత్రమే  ఉందన్నారు.

 Can't give special status to Andhra Pradesh :Arun Jaitley

అదే విధంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఇచ్చిన లెక్క కూడా చూపించారు. రాజ్యాంగం అనుమతి ఇచ్చిన మేరకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు సబ్సిడీలు ఇవ్వాలనే డిమాండ్ కూడా నెరవేర్చలేమన్నారు. ఏపీకి ఇస్తే బీహార్, ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందన్నారు.

ప్రత్యేక హోదా అనేది భౌగోళిక స్వరూపం ఆధారం ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదాయం తక్కువగా ఉంటుందని.. అందుకే అక్కడ హోదాని కొనసాగిస్తున్నాం అన్నారు. ఏపీకి అలాంటి పరిస్థితి లేదని వివరించారు. విభజన తర్వాత జరిగిన నష్టాన్ని హోదాకి సమానమైన ప్యాకేజీతో కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -