ముగిసిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం..

128
Campaigning for final phase

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. తుదివిడత పోలింగ్‌ జరిగే రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ప్రచార గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ నెల 19న లోక్‌ సభ ఎన్నికల తుది విడత (7వ విడత) పోలింగ్‌ జరుగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 53 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 19న సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నెల 23న లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కీలకమైన 13 స్థానాలకు చివరి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 167 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి విడత ఎన్నికల బరిలోనే ఉంది. దీంతోపాటు పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పశ్చిమ బంగాల్‌లోని 9 స్థానాలకు, బిహార్‌లో 8 పార్లమెంటు స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాలకు, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, ఝార్ఖండ్‌లో 3, ఛండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, శత్రుఘ్నసిన్హా, హర్‌ సిమ్రత్‌ కౌర్‌ తదితరులు ఈ విడతలోనే పోటీ చేస్తున్నారు.