జై సింహా..హిట్ అవడం ఖాయం

194
C Kalyan about Jai simha movie
- Advertisement -

పైసా వసూల్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ  చిత్రానికి ఆసక్తికర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన చివరగా జై సింహా అని టైటిల్ ఫిక్స్ చేశారు.   వచ్చే సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఆడియెన్స్ ముందుకు రానుంది.   నవంబర్ 1వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

C Kalyan about Jai simha movie
సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య బాబు సరసన ముచ్చటగా మూడోసారి నయనతార జంటగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ హరిప్రియ, మళయాళం నటి నతాశా దోషి  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్ లో 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘మహాధర్నా’ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నట్టు చెప్పారు.   బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయని, అదే విధంగా ‘జై సింహా’ సినిమా కూడా విజయం సాధిస్తుందని  అన్నారు.  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ చిత్రాన్ని తాను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

- Advertisement -