మేడారం జాతర.. బస్సు ఛార్జీలివే

564
medaram
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ…తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాభవుతోంది. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక మేడారం జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్ధం బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ. వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే బస్సు ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. నాలుగు వేల బస్సులతో సుమారు 23 లక్షల మంది భక్తులను చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

()హైదరాబాద్‌ నుంచి మేడారం జాతరకు రూ.440
() జనగామ నుంచి మేడారం జాతరకు రూ. 280
()మహబూబాబాద్‌ నుంచి మేడారం జాతరకు రూ.270
() కాళేశ్వరం నుంచి మేడారం జాతరకు రూ.260
()వరంగల్‌ నుంచి మేడారం జాతరకు రూ.190 బస్సు ఛార్జీలు ఉండనున్నాయి.

ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజుల రాక..6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక..7న అమ్మవార్లకు మొక్కులు..8న తల్లుల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.

- Advertisement -