సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్‌..

256
Bumrah
- Advertisement -

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. సౌతాఫ్రికాతో సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియాను టాస్ వెక్కిరించింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారథి ఫాఫ్ డు ప్లెసిస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మ్యాచ్‌లో టీమిండియా వికెట్ల పతనం మొదలెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా రెండు వికెట్ కోల్పోయింది. వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ బుమ్రాకే ఆ వికెట్లు దక్కింయి. నాలుగో ఓవర్ రెండో బంతిని షాట్ ఆడిన ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతికి చిక్కాడు.

బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న బుమ్రాకు తన తొలి మ్యాచ్‌లోనే ఆరంభంలోనే వికెట్ దక్కడం విశేషం. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. డుప్లెసిస్, రసియ వ్యాన్‌ క్రీజులో ఉన్నారు.

- Advertisement -