మోడీపై పోటీ..మాజీ జవాన్‌ నామినేషన్ తిరస్కరణ..!

337
modi tej bahadur
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుండి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గం నుండి తెలంగాణ,తమిళనాడుకు చెందిన రైతులు ఎన్నికల బరిలో ఉండగా మాజీ జవాన్‌ తేజ్ బహదూర్ యాదవ్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా తేజ్ బహదూర్‌కి షాకిచ్చింది ఎన్నికల సంఘం. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు వారాణాసి జిల్లా మెజిస్ట్రేట్, ఎన్నికల అధికారి సురేంద్రసింగ్ తెలిపారు.

సాయుధ దళాల నుంచి బర్తరఫ్ కు గురైన వ్యక్తి తనకు అవిధేయత లేదా అవినీతి కారణంగా డిస్మిస్ కాలేదని సర్టిఫికేట్ పొందుపర్చాల్సి ఉంటుంది. బుధవారం ఉదయం 11 గంటల లోపల ఆ సర్టిఫికేట్ ను తేజ్ బహుదూర్ సమర్పించలేకపోయారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. తొలుత స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆసక్తికనబర్చారు తేజ్ బహదూర్. చివరి క్షణంలో అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీ తమ పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్‌ను పక్కన బెట్టి తేజ్‌ బహదూర్‌కు బీ ఫాం ఇచ్చింది.అయతే తాజాగా తేజ్ బహదూర్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు.

- Advertisement -