‘ఆర్ఆర్ఆర్’లో మరో ఇద్దరు బాలీవుడ్‌ హీరోలు..

309
rrr
- Advertisement -

ధర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నట్టు ఇటీవల రాజమౌళి ఓ కార్యక్రమంలో తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్‌లను కథానాయికలుగా ఎంచుకున్నారు.

RRR

ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ నటించనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లు నటించనున్నారట. అంతేకాదు ఈ సినిమా దర్శక, నిర్మాతలు సంజయ్, వరుణ్‌ను సంప్రదించగా వీరు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. . అయితే ఈ విషయం అధికారికంగా మాత్రం ఇంకా బయటికి రాలేదు.

- Advertisement -