రివ్యూ:బ్లఫ్ మాస్టర్…

300
Bluff Master Telugu Movie Review
- Advertisement -

క్షణం, ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలతో మంచిగుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఇప్పటివరకు సపోర్టింగ్ రోల్స్‌తో వెండితెరపై మెరిసిన సత్యదేవ్..బ్లఫ్ మాస్టర్ సినిమాతో హీరోగా మారాడు. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శతురంగవేట్టై సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సత్యదేవ్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం….

కథ‌ :

ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌)చిన్నప్పుడే తల్లిదండ్రులను కొల్పోతాడు. బ్రతకాలంటే డబ్బు కావాలనే ఉద్దేశంతో ఏం చేయడానికైనా వెనుకాడడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను తారుమారుచేసి బయటపడతాడు. సీన్ కట్ చేస్తే ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారతాడు..?తర్వాత ఎదురైన సమస్యలేంటీ అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for bluff master telugu

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సత్యదేవ్‌ నటన,డైలాగ్స్‌. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో,ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా ఆకట్టుకున్నాడు. ప్రతీ సన్నివేశంలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో ఒదిగిపోయింది హీరోయిన్ నందితా శ్వేత. తెరపై వీరిద్దరి కెమిస్ట్రి బాగుంది.ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్లోగా సాగే కథనం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌ పేరుతో డ్యూయెట్లు, ఫైట్లు ఇరికించకుండా సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సునీల్‌ కాశ్యప్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

తమిళ మూవీని తెలుగు నేటివిటిగా తగ్గట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు గోపీ గణేష్.అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా థనంలో తన మార్క్‌ చూపించాడు. తనదైన డైలాగ్స్‌తో ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ఓవరాల్‌గా ఇయర్ ఎండ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం బ్లఫ్ మాస్టర్.

విడుదల తేదీ:28/12/18
రేటింగ్: 2.75/5
నటీనటులు : సత్యదేవ్‌, నందిత శ్వేత, ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ
సంగీతం : సునీల్‌ కాశ్యప్‌
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్‌, పి. రమేష్‌
దర్శకత్వం : గోపి గణేష్‌

- Advertisement -