చేతిలో 4..కమలానికి 19

204
Bjp splashed across 19 states
- Advertisement -

2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడతున్న కొద్ది బీజేపీ తన బలాన్ని పెంచుకుంటు పోతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు,మూడు రాష్ట్రాలు మినహా ఎన్నికలు జరిగిన ప్రతిచోట బీజేపీ విజయ దుందుభీ మోగిస్తోంది. తాజాగా జరిగిన గుజరాత్,హిమాచల్ ప్రదేశ్‌లను తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ..తాము పాలిస్తున్న రాష్ట్రాల సంఖ్యను 19కి పెంచుకుంది.

దేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో 19 బీజేపీ పాలనలో ఉండగా హస్తం పార్టీ చేతిలో నాలుగు మిగిలాయి. కర్నాటక, పంజాబ్, మిజోరామ్, మేఘాలయ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1993లో మొత్తం 26 రాష్ట్రాల్లో 15 కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేవి. కానీ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి వచ్చి ఆ రికార్డును చేరిపేసింది.

2014  సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కేవలం ఐదు రాష్ట్రాల్లో (గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాగాలాండ్)నే అధికారంలో ఉండేది. 2014 ఎన్నిలతోపాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అటు సిక్కింలో అధికారంలోకి వచ్చాయి.

Bjp splashed across 19 states
ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన సాయంతో అధికారంలోకి రాగా.. అదే సమయంలో హర్యానాలోనూ పాగా వేసింది. తర్వాత జార్ఖండ్ పాగా వేసిన బీజేపీ జమ్ముకశ్మీర్ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడి పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

2015లో బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమే మోదీకి మింగుడు పడలేదు. అయితే అక్కడ ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీవైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.  2015లో అస్సాంలో ఘనవిజయం సాధించగా అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 47 మంది ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరి కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

యూపీతోపాటు ఉత్తరాఖండ్‌లోనూ బంపర్ మెజార్టీతో గెలిచింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచినా.. స్థానిక పార్టీల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. పంజాబ్‌లో మాత్రం బీజేపీకి ఓటమి తప్పలేదు.

- Advertisement -