అమిత్ షా టూర్ … తెలంగాణ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు?

402
amith sha
- Advertisement -

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సారిగా తెలంగాణకు విచ్చేశారు. ఈసందర్భంగా శంషాబాద్ లోని కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో అమిత్ షా ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ , పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.అయితే అమిత్ షా రాకపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

ముఖ్యంగా తెలంగాణలో చాలా మంది నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం చేసుకున్నారు కాషాయ నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిస్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మీటింగ్ లో బీజేపీలో చేరుతారని ప్రచారం జరగగా.. ఆయన చేరిక జరుగలేదు.

కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తప్ప మిగతా వారు ఎవరూ కాషాయ కండువా కప్పుకోలేదు. దీంతో చేరికలతో పార్టీలో కొత్త జోష్ నింపుదాం అనుకున్న కాషాయ నేతలకు షాక్ అనే చెప్పుకోవాలి. అమిత్ షా రాకతో తెలంగాణలో రాజకీయాలు మారిపోతాయన్న కాషాయ నేతలు..ఇవాళ ఒక్కరు కూడా జాయిన్ కాకపోవడంతో అమిత్ షా టూర్ ఫెయిల్ అయిందని చర్చ నడుస్తుంది.

- Advertisement -