టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధం..:రాజాసింగ్

165
rajasingh trs

తెలంగాణలో బీజేపీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.గోషామహల్ నుండి భారీ మెజార్టీతో గెలిచిన రాజాసింగ్ తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు అభ్యంతరం లేదు కానీ మూడు హామీలను నెరవేర్చాలని కోరికల చిట్టా విప్పారు.

హైదరాబాద్‌లో శ్రీరామ్‌ శోభాయాత్ర సందర్భంగా సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాల దగ్గర జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, గోవుల సంరక్షణ, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, తమ పోరాటానికి కేసీఆర్‌ కలిసి రావాలని కోరారు.కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు.

అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తయ్యాక మధుర, కాశీల్లోనూ మందిరాలు నిర్మించనున్నట్లు రాజాసింగ్‌ తెలిపారు.భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.