పాక్ పాట..భారత ఆర్మీకి:రాజాసింగ్‌పై సెటైర్లు

152
bjp mla rajasingh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాటపై దుమారం చేలరేగుతోంది.హిందుస్తాన్ జిందాబాద్ అంటూ పాటపాడిన రాజాసింగ్ శ్రీరామనవమి సందర్భంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు.భారత సైనికులకు ఈ పాటను అంకితంఇస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే ఇంతవరకు బాగానే ఉన్నా రాజాసింగ్ తమ పాటను కాపీ కొట్టారని పాక్ ఆర్మీ ఆరోపించింది.

మార్చి 23న తాము రూపొందించిన పాకిస్తాన్ జిందాబాద్ అనే పాటను కాపీ కొట్టారని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు.పాక్ మీడియా సైతం పాకిస్తాన్ జిందాబాద్ అనే పాటను హిందూస్తాన్ జిందాబాద్‌గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పేర్కొంది.

రాజాసింగ్ పాటపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది.పాక్ ఆర్మీ పాటను భారత జవాన్లకు అంకితం ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.