ఈ ఎమ్మెల్యే ఫుల్‌గా తాగి ఏం చేశాడో చూడండి..!

310
BJP MLA Kunwar Pranav Singh
- Advertisement -

ఉత్తరాఖండ్‌ ఖాన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ చేసిన ఓ నిర్వాకం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. ఈ ప్రబుద్దుడు ఇటీవలే తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సంతోషంలో తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ లోని ఓ హోటల్‌లో ఎంజాయ్ చేశారు. మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు ప్రణవ్ చిందేశారు.

అయితే, మందేసి, చిందేసిన ప్రణవ్ తన తుపాకులను చేతిలో పెట్టుకుని ప్రదర్శించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ విషయం బయటపడింది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రణవ్ ను పార్టీ నుంచి కొన్ని నెలల పాటు బహిష్కరించారు. మరోమారు వివాదంలో చిక్కుకున్న ప్రణవ్ పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

- Advertisement -