బీజేపీ అగ్రనేత అద్వానీకి అస్వస్థత..

208
advani

బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 15 వేడుకలకు దూరం కానున్నారు. ప్రతీ ఏటా ఆయన నివాసంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించే వారు. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించట్లేదని అద్వానీ కార్యాలయం ప్రకటించింది.

బీజేపీ అగ్రనేత అద్వానీకి ప్రస్తుతం 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన ఆయన పార్టీ నిర్మాణానికి విశేషమైన కృషి చేశారు. రథయాత్ర చేపట్టి బీజేపీని అధికారంలోకి తేవడంలో విశేష పాత్ర పోషించారు.

భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించారు. 75 ఏళ్లు నిండిన నేతలు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయంతో గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు అద్వానీ.