బిజెపి, కాంగ్రెస్ మధ్య బి ఫార్మ్ ల చిచ్చు..

286

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య బి ఫార్మ్ ల చిచ్చు చెలరేగింది. కామారెడ్డి మున్సిపల్ నామినేషన్ విత్ డ్రా సెంటర్ వద్ద బిజెపి అభ్యర్థుల ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ సీట్లను బిజెపి పార్టీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, ఇంచర్జ్ వెంకటరమణ రెడ్డిలు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపణలు చేశారు. బి ఫాం లిస్టును చింపెందుకు అభ్యర్థులు యత్నించారు.

bjp

పని చేసే వారికి కాకుండా డబ్బులు ఇచ్చే వారికి టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు. కుల మతాల ప్రాతిపదికన టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆరోపించారు. కామారెడ్డిలో మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని శబ్బిర్ అలీ, ఆయన సోదరుడు నయీమ్‌పై కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.