రూ. 30 కోట్లతో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌..

161
biodiversity
- Advertisement -

హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఫ్లై ఓవర్‌ని ప్రారంభించనున్నారు.

690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల మూడు లేన్ల ఈఫస్ట్ లెవల్ ఫైఓవర్‌ నిర్మాణానికి రూ. 30.26 కోట్లు ఖర్చు అయింది. ఈ ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

ఈ ఫ్లైఓవర్‌ పూర్తితో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల అంచనా వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి.

- Advertisement -