బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

506
bonthu rammohan
- Advertisement -

దాదాపు 43 రోజుల తర్వాత గ్రైటర్ హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పున ప్రారంభమైంది. గతేడాది నవంబర్‌ 23వ తేదీన ఈ ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరగడంతో అప్పట్నుంచి ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. నిపుణుల కమిటీ సూచనల తర్వాత ఇవాళ ఉదయం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఫ్లై ఓవర్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్‌ ఇవాళ్టి నుంచి ఫ్లై ఓవర్‌పై రాకపోకలు సాగుతాయని చెప్పారు. వేగం 40 కంటే మించకూడదని …నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఫ్లై ఓవర్‌పై సెల్ఫీలు దిగకుండా సైడ్ వాల్స్ ఏర్పాటుచేశామని ఒకవేళ ఎవరైనా సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తామని చెప్పారు. స్పీడ్‌ లిమిట్‌ కంట్రోల్‌ కోసం చర్యలు తీసుకున్నామని…కెమెరాలు, స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాల వేగం, వాహనదారుల ప్రవర్తనను నెల రోజుల పాటు పరిశీలిస్తామని మేయర్‌ చెప్పారు. రోజువారీగా నివేదికను నిపుణుల కమిటీకి పంపిస్తామన్నారు.

- Advertisement -