నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం..

262
Bike stunt ride by Rajasthani Old Man
- Advertisement -

బైక్‌ పై విన్యాసాలు చేస్తే.. ఆ వృద్దుడి మనసు ఎంజాయ్‌ చేస్తుంది అనుకున్నాడో ఏమో కానీ, చూసేవాళ్లకు ఒళ్లు మాత్రం జలదరిస్తుంది. గుండెలు జారిపోతాయంటే కూడా ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. మెట్రో సంస్కృతితో నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. యువతే కాదు వయస్సుతో సంబందం లేకుండా ఐదు పదుల వయస్సులో కూడా కోందరు బైక్‌లపై విన్యాసాలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టేస్తున్నారు.

అదే విధంగా ఓ వృద్ధుడు ఏకంగా బైక్‌పై సిలిండర్‌ పెట్టి దానిపై దర్జాగా కూర్చుని కాళ్లతో బైక్‌ నడిపాడు. రాజస్థాన్‌కి చెందిన ఇతను ఇలా నిర్లక్ష్యంగా బైక్‌ నడుపుతుండగా రోడ్డుపై వెళుతున్న వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరలైంది. కొందరేమో ఈ వయసులోనూ ఇలాంటి విన్యాసాలు చేస్తున్నందుకు అభినందిస్తుంటే.. మరికొందరు పేలుడు పదార్థంపై కూర్చుని ఇలా నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు ఇలాంటి విన్యాసాలు చేయకుండా ఆ వృద్ధుడిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వివిధ రకాల స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారు. అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

- Advertisement -