బిగ్ బాస్3 ముగ్గురు సేఫ్… ఈ వారం డబుల్ ఎలిమినేషన్?

167
biggbos

బిగ్ బాస్ 3 రియాల్టీ షో ఇంకో రెండు వారాల్లో ముగియనుంది. కాగా 13వ వారం నామినేషన్ లో ఇంటిసభ్యులు అందరూ ఉన్నారు. ఏడుగురు సభ్యులలోనుంచి ఎవరో ఒకరు ఇవాళ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోనున్నారు. శనివారం జరగిన ఎపిసోడ్ లో చాలా హంగామా జరిగింది. నాగార్జున ఎంట్రీతో అదరగోట్టాడు. ఇక ఈవారం కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులతో స్టేజి పైకి వచ్చి మాట్లాడారు.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఫైనల్‌కి వెళ్లబోయే ఐదుగురి ఎవరో తేల్చేందుకు కంటెస్టెంట్స్ రిలేటివ్స్‌ని బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకువచ్చారు నాగార్జున. వాళ్లతో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించారు. వాళ్లు తెచ్చిన గిఫ్ట్స్‌తో పాటుగా ఎవరు సేవ్ అయ్యారనే కార్డ్‌ను కూడా ఆ గిఫ్ట్‌లో జతచేశారు. ఈ టాస్క్ ప్రకారం ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏడుగురి ఫొటోలను ఒక బోర్డ్ మీద ఉంచి వీళ్లలో టాప్ 5 కంటెస్టెంట్స్ కాకుండా అర్హత లేదనుకుంటున్న ఇద్దర్ని వేరు చేయాలని టాస్క్ ఇచ్చారు. మొదటిగా ఆ టాస్క్ ఆడేందుకు వరుణ్ చెల్లెలు స్టేజ్ మీదికి రాగా.. శివజ్యోతి,అలీలకు అర్హతలేదంది. అనంతరం తన అన్నకోసం తెచ్చిన గిఫ్ట్‌ను స్టోర్ రూం ద్వారా అందించగా.. అందులో వరుణ్ పేరు లేకపోవడంతో నామినేషన్స్ నుండి సేవ్ కాలేకపోయాడు.

ఆ తర్వాత శ్రీముఖి తండ్రి రామక్రిష్ణ వచ్చారు. శ్రీముఖి కోసం తెచ్చిన టెడ్డీ బేర్ గిఫ్ట్‌ని అందించారు. ఆ గిఫ్ట్‌ని రాహుల్‌తో ఓపెన్ చేయించారు. అయితే రాహుల్ చేతుల మీదుగా ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది శ్రీముఖి.

తర్వాత వితికా తల్లి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి వచ్చింది. మీరంతా బిగ్ బాస్ అయిన తరువాత మా ఇంటికి వస్తే.. భీమవరం వంట వండి పెడతా అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక తన కూతురు కంటే అల్లుడు వరుణ్ బంగారం అని అంది. అనంతరం వితికా కోసం తెచ్చిన గిఫ్ట్‌ని అందించగా అందులో వితికా పేరు లేకపోవడంతో సేవ్ కాలేకపోయింది వితికా.

ఇక అలీ కోసం అతని బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ రవి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి సందడి చేశాడు. రవి అలీ కోసం గిఫ్ట్ అయితే తెచ్చాడు కాని అతన్ని నామినేషన్ నుండి సేవ్ చేయలేకపోయాడు. రవి ఇచ్చిన గిఫ్ట్‌లో అలీ పేరు లేకపోవడంతో నామిమినేషన్ నుండి సేవ్ కాలేకపోయాడు అలీ.

రాహుల్ కోసం తన స్నేహితుడు ప్రముఖ సింగర్ నోయల్ ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చాడు. పాట పాడుతూ రాహుల్‌తో కలిసి బిగ్ బాస్ స్టేజ్‌ని షేక్ చేశారు. టైటిల్ నువ్వే కొడుతున్నావ్.. అని చెప్పాడు. ఇక నోయల్ ఇచ్చిన గిఫ్ట్‌లో రాహుల్ పేరు ఉండటంతో ఈవారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.

శివజ్యోతి అక్క బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి నాగార్జున చూసి సర్ ప్రైజ్ అయ్యింది. శివజ్యోతి మాట పక్కనపెట్టేసి ఎంత గ్లామర్‌గా ఉన్నారో అంటూ నాగార్జునని చూసి మురిసిపోయింది. అనంతరం ఆమె తెచ్చిన గిఫ్ట్‌లను శివజ్యోతికి అందించగా అందులో ఆమె పేరు లేకపోవడంతో నామినేషన్ నుండి గట్టెక్కలేపోయింది శివజ్యోతి. ఆమె తరువాత బాబా భాస్కర్ అక్క వచ్చి గిఫ్ట్ ఇచ్చి తమ్ముడ్ని నామినేషన్ నుండి సేవ్ చేయగలిగింది. ఆమె తెచ్చిన గిఫ్ట్‌లో బాబా పేరు ఉండటంతో ఈవారం నామినేషన్ నుండి సేవ్ అయ్యారు బాబా భాస్కర్.