శ్రీముఖి టార్గెట్.. మహేశ్ విట్టా అవుట్

270
Mahesh Vitta

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. నాగార్జున హోస్ట్ గా వ్యహరిస్తున్న ఈషోకు గత రెండు సీజన్ల కంటే రేటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఎన్నో వివాదాల మధ్య ఈషో ప్రారంభంకాగా ఇంకో నెల రోజుల్లో ఈషో ముగియనుంది. ఇక ప్రతీ వారం ఎలిమినెట్ అయ్యే కంటెస్టెంట్ ల వివరాలు సోషల్ మీడియాలో ముందుగానే తెలిసిపోతున్నాయి. ఈ ఆదివారంతో 11 వారాలు పూర్తి చేసుకోబోతుంది బిగ్‌బాస్ 3 మూడో సీజన్.

ఈ వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో వరుణ్, రాహుల్, మహేష్ ఉన్నారు.మహేష్ .. శ్రీముఖి టార్గెట్ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ మహేష్‌కు ఓట్లు వేయవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ వారం మహేష్ విట్ట హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు. గత వారమే మహేష్ విట్ట హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నాడనే సమాచారం లీకైంది. కానీ లాస్ట్‌కు పునర్నవి..హౌస్‌ నుండి ఎలిమినేట్ అయింది.