బీఎస్‌పీ చీఫ్‌కు షాక్‌..400 కోట్ల ప్రాపర్టీ సీజ్‌..!

481
mayavathi
- Advertisement -

బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి గట్టి షాక్ తగిలింది. నోయిడాలోని మాయావతి సోదరుడికి చెందిన సుమారు ఏడు ఎకరాల ఫ్లాట్‌ అక్షరాల 400 కోట్ల విలువైన ఫ్లాట్‌ని ఐటీ అధికారులు సీజ్ చేశారు.

ఎన్నికల తర్వాత ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చిన మాయావతి పార్టీ బలోపేతం దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తన సోదరుడు ఆనంద్ కుమార్‌ని బీఎస్పీ ఉపాక్షుడిగా నియమించారు మాయా. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆనంద్ పేరుపై యూపీలోని నొయిడాలో ఉన్న ఈ బినామీ ఆస్తిని ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) జప్తు చేస్తూ ప్రొవిజినల్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ బినామీ ప్లాట్‌లో అయిదు అంత‌స్తుల హోట‌ల్‌ను నిర్మించాలనుకున్నట్లు సమాచారం.

బినామీ వ్యవహారాల నిరోధక (సవరణ) చట్టం-2016 ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉంటేవారికి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే ఆస్తి విలువలో 25 శాతం మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఘటనపై మాయావతి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -