నేడే బిగ్ బాస్ 3.. తొలిరోజు షూటింగ్ పూర్తి..

372
Big Boss Telugu Season 3
- Advertisement -

నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమవుతుందా లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. నిన్న ఉస్మానియా విద్యార్థులు హైదరాబాద్‌లోని నాగార్జున ఇంటిని ముట్టడించి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అరెస్టుల ఫర్వం కొనసాగింది. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా బిగ్ బాస్ రియాలిటీ షో నేడు ప్రారంభం కానుందని తెలుస్తోంది.

తాజాగా దీనికి సంబంధించిన తొలిరోజు షూటింగ్ పూర్తయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను నాగ్, హౌస్ లోకి పంపారని, ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అంటున్నారు. వీరి పేర్లు బయట పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ కార్యక్రమం నేటి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. వీరంతా 90 రోజుల పాటు హౌస్‌లో గడపనున్నారు.

biggboss

కాగా, మధ్యలో మరికొందరు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. తొలి రోజు షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగిందని, హోస్ట్‌గా నాగార్జున చాలా బాగా చేశాడని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఈ సీజన్ బిగ్ బాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. తొలిరోజుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు నిర్వాహకులు.

అయితే హోస్ట్‌తో పాటు బిగ్ బాస్‌ రియాలిటీలో షోలో కీలకమైన కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉండబోయే ఆ 15 కంటెస్టెంట్స్‌పై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తుండగా.. ఈ 15 పేర్లు దాదాపు ఖాయం అయ్యేట్టు కనిపిస్తోంది.

ఆ 15 మంది కీలకమైన కంటెస్టెంట్స్ వీరే..

1. నటి హేమ
2. యాంకర్ శ్రీముఖి
3. తీన్మార్ యాంకర్ సావిత్రి
4. నటి హిమజా రెడ్డి
5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట)
7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ
8. టీవీ యాక్టర్ అలీ రెజా
9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్
10. పునర్వీ భూపాలం
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్ రాహుల్
13. యూట్యూబ్ స్టార్ మహేష్
14. టీవీ నటి రోహిణి
15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి

- Advertisement -