గుల్ గులౌతోంది… బిగ్ బాస్ 101 ఎపిసోడ్ హైలైట్స్‌

517
big boss 3 telugu
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఇంకా నాలుగు రోజులే మిగిలిఉండటంతో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొనగా మంగళవారంతో 101 ఎపిసోడ్‌ని పూర్తిచేసుకుంది.

బిగ్ బాస్ 100వ ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌లోకి ప్రవేశించిన యాంకర్ సుమ రెండో రోజు సందడి చేసింది. వరుణ్‌ సందేశ్‌ను బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా బిగ్ బాస్ ప్రతిపాదించడంతో ఫ్యాన్ కాల్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో నిజామాబాద్ నుండి రవి అనే కాలర్ వరుణ్ సందేశ్‌‌తో మాట్లాడారు. వరుణ్‌కే కాకుండా మిగిలిన ఇంటి సభ్యులకు కూడా వాళ్ల ఫ్యాన్స్ పంపిన ట్వీట్స్ చదివి వినిపించారు.

శ్రీముఖి వరస్ట్ కంటెస్టెంట్ …జెండర్ కార్డు వాడుతోందని నెటిజన్లు ట్వీట్ చేయగా దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇక మరో ట్వీట్‌లో బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కూల్ అంటూ రావడంతో దాన్ని చూసి మురిసిపోయింది శ్రీముఖి.

ఇక బాబా భాస్కర్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. బాబా ఈజ్ బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 3 అంటూ కొంతమంది ట్వీట్ చేయగా మరికొంతమంది ఊసరవిల్లి అంటూ పేర్కొన్నారు. ఇక వరుణ్ సందేశ్‌ తనకు వచ్చిన ట్వీట్స్ చదివి వినిపిచారు. ఈ సీజన్‌లోనే వరస్ట్ కంటెస్టెంట్.. హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్ అంటూ ట్వీట్లు రాగా వాళ్లకు థాంక్స్ చెప్పాడు వరుణ్.

ఇక రాహుల్‌ను కొంతమంది నక్కతో పోల్చుతూ చాలా అగ్రసీవ్ అంటూ ట్వీట్స్ చేయగా మరికొంతమంది చాలా మంది హృదయాలను గెలుచుకున్నావు. ఎవరు ఏమన్నా స్మైల్‌తోనే ఆన్సర్ ఇచ్చే మంచి మనిషి అంటూ పేర్కొన్నారు.

తర్వాత రాహుల్ పాడిన పాటకు శ్రీముఖితో సహా యాంకర్ సుమ, బాబా భాస్కర్, అలీలు డ్యాన్స్‌లతో బిగ్ బాస్ హౌస్‌ను హోరెత్తించారు. తర్వాత బాణాసంచా కాల్చుతూ దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక చివరలో రాహుల్ పాడిన గుల్ గులౌతోంది బిగ్ బాస్. నాకు ట్యాబ్లెట్స్ పంపించండి అంటూ పేరడి సాంగ్‌తో నవ్వులు పూయించారు.

- Advertisement -