బిగ్ బాస్‌ 3 : ఒక్క క్లిక్‌తో ఓటు..

619
big boss 3
- Advertisement -

బిగ్ బాస్ 3 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. ఎలిమినేషన్స్ ప్రక్రియ ముగియడంతో టాప్ 5 కంటెస్టెంట్స్‌గా వరుణ్,అలీ,రాహుల్,శ్రీముఖి,బాబా భాస్కర్‌లు బరిలో నిలిచారు. వీరిలో ఒకరు విజేతగా నిలవనుండగా గెలిచిన వారికి 50 లక్షల రూపాయలు బహుమతిగా అందనుంది.

ఈ ఐదుగురిలో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఓటు వేయాలంటే రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి హాట్ స్టార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం లేదా సెల్ ఫోన్ నెంబర్ నుంచి మిస్‌ కాల్ ఇవ్వడం. ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేయొచ్చు. రోజులో ఒక్కోనెంబర్ నుండి పది వరకూ ఓట్లు వేయొచ్చు. ఎవరికి ఎన్ని ఓట్లు వేయాలన్నది ఓటర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

లేదంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి హాట్ స్టార్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అనంతరం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోగానే.. తెలుగుకి సంబంధించి హాట్ స్టార్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల లిస్ట్ వస్తుంది. అందులో బిగ్ బాస్‌ను సెలెక్ట్ చేసుకోగానే లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్లే అవుతుంది. ఆ కిందనే గ్రీన్ కలర్‌‌తో VOTE అని రాసి ఉంటుంది. VOTEని క్లిక్ చేయగానే లాగిన్ ఎంటర్ చేయమని వస్తుంది. ఈ లాగిన్ ఫేస్ బుక్ లేదా మొబైన్ నంబర్ నుండి లాగిన్ కావొచ్చు.

లాగిన్ అయిన తరువాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఒక వేళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే సంబంధిత నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ టీ పీ నంబర్‌ని ఎంటర్ చేసి వివరాలను అందిస్తే కొత్తగా అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కు 10 ఓట్లను ఇవ్వొచ్చు. అలా కాకుండా ఈ పది ఓట్లను మనకు నచ్చినట్టుగా కూడా షేర్ చేయవచ్చు.

- Advertisement -