బిగ్ బాస్..డే ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్

486
big boss
- Advertisement -

బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో 89 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని 90వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. ఈవారం టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో నేర్చుకున్న విషయాలపై గ్రాఫ్ గీయాల్సిలనే టాస్క్ విధించగా ఇంటి సభ్యులంతా తమ అనుభవాలను వివరించారు. తర్వాత డే ఆఫ్ ఎంటర్‌ టైన్‌మెంట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఇందులో భాగంగా సభ్యులకు ఇచ్చిన పాత్రలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. రాహుల్‌కి కాంచన, అలీకి గజిని, శివజ్యోతికి చంద్రముఖి,బాబా భాస్కర్‌కి బాషా, శ్రీముఖికి మహానటి, వరుణ్-వితికాలు బాహుబలి, దేవసేన, పాత్రల్ని ఇచ్చారు. మహానటి సావిత్రి పాత్రలో శ్రీముఖి, చంద్రముఖి పాత్రలో శివజ్యోతి ఆకట్టుకోగా  కాంచన పాత్రలో జీవించేశాడు రాహుల్.గజనీగా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు అలీ.

దేవసేనగా వితికా,బాహుబలిగా వరుణ్‌ నటించగా శ్రీముఖి ఇచ్చిన ఐడియాతో వరుణ్ భుజాలపై నుండి వితికా నడిచే ప్రయత్నం చేసి వరుణ్ వీపుపై పడింది. వరుణ్ పైకి లేవకుండా అలాగే ఉండిపోయాడు. బాహుబలి -దేవసేనలు రొమాంటిక్ సాంగ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు వితికా వరుణ్‌. మొత్తంగా డే ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్‌ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది.

- Advertisement -