కోహ్లీ సెంచరీ.. టీమిండియా ఘన విజయం

214
india vs westindies

కోహ్లీ సెంచరీ…భువి మెరుపులతో విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.భారత్ విధించిన 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్ తొలుత ధాటిగానే ఆడిన తర్వాత చేతులెత్తేశారు. ప్రతికూల వాతావరణంతో విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 టార్గెట్ విధించగా 42 ఓవర్లలో 210 పరుగులకే చాప చుట్టేశారు. ఎవిన్ లూయిస్ 65, నికోలస్ పూరన్ 42 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి బెంబేలెత్తించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్,రోహిత్ నిరాశపర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. తన పరుగుత దాహాన్ని తీర్చుకుంటూ వన్డేల్లో 42వ సెంచరీ సాధించాడు. 14 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 125 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ (20), శ్రేయాస్ అయ్యర్ 71, కేదార్ జాదవ్ 16, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు.

సెంచరీతో కదం తొక్కిన కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా మూడే వన్డే 14న జరగనుంది.