‘భీష్మ’ను వీడని వివాదం..!

260

యూత్‌ స్టార్‌ నితిన్ తాజాగా నటించిన సినిమా ‘భీష్మ’.ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రంను వివాదం చుట్టుముడుతోంది. ఈ సినిమాకు భీష్ముడి పేరు పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదన వ్యక్తం చేసింది. భీష్ముడి లాంటి గొప్ప వ్యక్తి పేరును సినిమాకు పెట్టడాన్ని సహించబోమని, వెంటనే పేరు మార్చాలని ఆ సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణ చైతన్య డిమాండ్ చేశారు.

bheeshma-movie

ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరును లవర్ బాయ్ పాత్రకు పెట్టడం సరికాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని, లేదంటే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామన్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. రిలీజ్ ముందు జరుగుతున్న ఈ లొల్లి సినిమా మీద అందరి దృష్టి పడేలా చేస్తోంది. అయితే.. ఈ హెచ్చరికల పర్వం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.