విశాల్‌ కలుపు మొక్క..తరిమికొట్టండి:భారతీ రాజా

508
vishal
- Advertisement -

నడిగర్ సంఘం ఎన్నికలు తారాస్ధాయికి చేరాయి. విశాల్‌ ప్యానల్‌ మరోసారి పోటీకి దిగగా విశాల్‌కు పోటీగా భారతీరాజా వర్గం బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో విశాల్‌పై హాట్ కామెంట్స్ చేశారు దర్శకుడు భారతీ రాజా. నడిగర్ సంఘం‌ నుండి తమిలేతరుడైన విశాల్‌ని తొలగించాలని.. నిర్మాతల మండలిలో మొలిచిన ఇలాంటి కలుపు మొక్కను ఏరేయాల్సిన బాధ్యత తమిళ నిర్మాతలపై ఉందన్నారు.

నడిగర్ సంఘంలో తెలుగు వాళ్ల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ.. ఇలాంటి పందికొక్కుల్ని తరిమికొట్టాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటుల సంఘం) పేరుని తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తామన్నారు భారతీ రాజా.

నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే.. అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తన నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడాలన్నారు.

- Advertisement -