కరోనా.. తెలుగు ప్రభుత్వాలకు పూరీ స‌ల‌హా..!

319
Director Puri Jagannath

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభింస్తోంది. ఇండియలో ఇప్పటికే వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రల్లో కరోనా కేసుల క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 67కు చేరగా.. ఒకరు కోలుకున్నారు. ఇక ఏపీలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 19కి చేరాయి. క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. అయితే క‌రోనాని క‌ట్టడి చేయాలంటే స్వీయ నియంత్ర‌ణ త‌ప్ప‌క పాటించాల‌ని వైద్యులు, ప్ర‌భుత్వం, ప్ర‌ముఖులు ఎంత‌గా చెప్పిన‌ప్ప‌టికీ, కొంతమంది మాత్రం తెలిగ్గా తీసుకుంటున్నారు.

అయితే ఇలాంటి ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ వినూత్న స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌జ‌లని ఇళ్ళ‌ల్లో ఉంచేందుకు డ్రోన్‌ ను ఉపయోగిస్తే ఉత్తమమని సలహా ఇచ్చారు. డ్రోన్‌ వ‌ల‌న పూర్తిగా లాక్ డౌన్ అవుతుంది. ఆర్మీ, పోలీస్ ఆఫీస‌ర్స్ ఎవ‌రు అక్క‌ర్లేదు. త‌క్కువ ఖ‌ర్చు మ‌రింత ఉప‌యోగం అని పూరీ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి పేర్కొన్నారు. అయితే ఆ వీడియోలో డ్రోన్‌కి దెయ్యం మాదిరిగా బొమ్మ‌ని అమ‌ర్చి జ‌న‌స‌మూహాల‌లోకి పంపిస్తే దానిని చూసి అంద‌రు ప‌రుగెత్తుతండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.. మరి పూరీ సలహాను మన ప్రభుత్వలు ఏమేరకు ఉపయోగించుకుంటారో చూడాలి.