అంచనాలు పెంచుతున్న ‘రాక్షసుడు’ ట్రైలర్..

126
Rakshasudu

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు 2న విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘నేనంటే భయానికే భయం. నన్ను పట్టుకోవాలని అనుకోకు. పట్టుకుందామనుకున్నా అది నేనవను..’ అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ట్రైలర్ లో ఎంట్రీ ఇస్తాడు. పోలీసు అధికారి పాత్రలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్, ఫైటింగ్ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.